రాజకీయ,మతపరమైన కార్యక్రమాలే ఇండియాలో మళ్లీ కరోనాకు కారణం

రాజకీయ,మతపరమైన కార్యక్రమాలే ఇండియాలో మళ్లీ కరోనాకు కారణం

భారత్ లో సెకండ్ వేవ్ కొనసాగుతోంది. దీంతో కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. ఇండియాలో కరోనా కేసులు భారీగా పెరగడానికి.. మత పరమైన, రాజకీయ సామూహిక సమీకరణాల కార్యక్రమాలే ప్రధాన కారణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. దీంతో మోడీ ప్రభుత్వం  ప్రపంచ దేశాల ముందు ఇరుకున పడ్డట్లు అయిందని తెలిపింది.

 B. 1.617 వేరియంట్‌ భారత్‌లో గతేడాది అక్టోబర్‌లోనే బయటపడినట్లు తెలిపింది WHO. భారత్‌లో కరోనా తిరిగి విజృంభించడం.. అది కూడా వేగంగా అభివృద్ధి చెందడంతో B.1.617, ఇతర వేరియంట్ల( B.1.1.7) వంటి వేరియంట్లపై అనుమానాలు తలెత్తేలా చేసిందని చెప్పింది. 

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కేసుల నిష్పత్తి పెరగటం.. వ్యాప్తికి కూడా మత పరమైన, రాజకీయ పరమైన కార్యక్రమాలే కారణమని తేల్చి చెప్పింది WHO. ప్రజారోగ్యం, సామాజిక చర్యలపై ఇంట్రెస్ట్ చూపకపోవడం కూడా కేసులు వేగంగా అభివృద్ధి చెందడానికి దారి తీశాయని WHO  తెలిపింది.